స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై నిధుల విషయంలో రాజీపడొద్దు : సీఎం రేవంత్

స్కిల్ యూనివర్సిటీపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఢిల్లీ, హర్యానా తరహాలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు

By Medi Samrat  Published on  19 July 2024 7:30 PM IST
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై నిధుల విషయంలో రాజీపడొద్దు : సీఎం రేవంత్

స్కిల్ యూనివర్సిటీపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఢిల్లీ, హర్యానా తరహాలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి అధికారులు ముసాయిదాను సిద్ధం చేశారు. ముసాయిదాలోని అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం పలు సూచనలు చేశారు. యూనివర్సిటీలో సర్టిఫికేషన్ కోర్సులు, డిప్లొమా కోర్సులకు సంబంధించి అధికారులు సీఎం, డిప్యూటీ సీఎంకు వివరించారు. కోర్సుల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.

యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణంపై సీఎం పలు కీలక సూచనలు చేశారు. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ముందుగానే వివిధ కంపెనీలతో చర్చించాలని సూచించారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై నిధుల విషయంలో రాజీపడొద్దని సీఎం అన్నారు. పూర్తిస్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ బిల్లు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్న‌ట్లు తెలుస్తుంది.

Next Story