తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జులై 24న ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు జరుగుతున్న వేళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించబోతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం అవుతారని అదే రోజు సాయంత్రం ఏఐసీసీ జాతీయ కార్యాలయం ఇందిరాభవన్ లో కాంగ్రెస్ ఎంపీలకు రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వేలో అవలంభించిన విధానాలు, బీసీలకు 42 శాతం శాతం రిజర్వేషన్ల అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ల బిల్లుల విషయంలో రేవంత్ రెడ్డి ప్రధానిని కలవబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.