రూ.160 కోట్లు ఖర్చుచేసి.. ప్రతీ గ్రామంలో, తండాలో పకడ్బందీగా వివరాలు సేకరించాం

దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదని.. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  4 Feb 2025 4:29 PM IST
రూ.160 కోట్లు ఖర్చుచేసి.. ప్రతీ గ్రామంలో, తండాలో పకడ్బందీగా వివరాలు సేకరించాం

దేశంలో బలహీనవర్గాలకు సంబంధించి ఇప్పటి వరకు సహేతుకమైన సమాచారం లేదని.. దీంతో రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కుల సర్వే-2024 నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. 1931 తరువాత భారతదేశంలో ఇప్పటి వరకు బలహీన వర్గాల సంఖ్య ఎంతో తేల్చలేదు.. జనాభా లెక్కల్లోనూ బలహీనవర్గాల లెక్కలు పొందుపరచలేదు.. అందుకే భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో కులగణన చేస్తామని మాట ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేశాం.. కులగణన ప్రక్రియను పూర్తి చేసి ఇవాళ నివేదికను సభలో ప్రవేశపెట్టామ‌ని తెలిపారు.

ప్రతీ గ్రామంలో, తండాల్లో ఎన్యూమరేటర్లు పకడ్బందీగా వివరాలు సేకరించారు.. ప్రతీ 150 ఇండ్లను ఒక యూనిట్ గా గుర్తించి.. ఎన్యూమరేటర్లను కేటాయించి వివరాలు సేకరించామ‌ని తెలిపారు. 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కష్టపడి ఈ నివేదికను రూపొందించారన్నారు. రూ.160 కోట్లు ఖర్చుచేసి ఒక నిర్దిష్టమైన పకడ్బందీ నివేదిక రూపొందించామ‌ని తెలిపారు. పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తరువాత సభలో ప్రవేశపెట్టాం.. 56 శాతం ఉన్న బీసీలకు సముచిత గౌరవం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామ‌న్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా నివేదికను రూపొందించడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాన‌న్నారు.

Next Story