గవర్నర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి రాజ్ భవన్ లో బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు.

By Medi Samrat
Published on : 6 Nov 2024 8:38 PM IST

గవర్నర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి రాజ్ భవన్ లో బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. రాష్ట్రంలో ప్రారంభమైన కులగణన సర్వే గురించి సీఎం గవర్నర్‌కు వివరించారు. సీఎం వెంట‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు.

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులసర్వే తీరును సీఎం గవర్నర్ కు వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను గవర్నర్ కు వివరించారు. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులసర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవనుందని సీఎం, ఇతర నేతలు తెలిపారు. 2025లో చేపట్టే దేశవ్యాప్త జనగణలో తెలంగాణ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కులసర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం గవర్నర్‌ను కోరారు. ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్ ను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి.

Next Story