ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి..బాపుఘాట్ అభివృద్ధిపై రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు.
By - Knakam Karthik |
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి..బాపుఘాట్ అభివృద్ధిపై రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగమైన “గాంధీ సరోవర్ ప్రాజెక్టు” గురించి చర్చించారు. ఫిబ్రవరి చివరి వారంలో జరగనున్న ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కేంద్ర మంత్రిని సీఎం ఆహ్వానించారు.
ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతానికి ఉన్న విశిష్టతను సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని ఇదే సంగమ స్థలిలో కలిపిన చారిత్రక ఘట్టాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ నది పునరుజ్జీవంలో భాగంగా, బాపుఘాట్ వద్ద ‘గాంధీ సరోవర్’ను నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
భవిష్యత్తులో బాపుఘాట్ ప్రాంతాన్ని కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా.. అంతర్జాతీయ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక మరియు పర్యావరణ చిహ్నంగా తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రితో పాటు ఈ భేటీలో తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర రక్షణ శాఖ భూముల అంశాలపై కూడా ప్రాథమిక చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ రోజు ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యాను. ఫిబ్రవరి చివరి వారంలో ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతంలో తలపెట్టిన “గాంధీ సరోవర్ ప్రాజెక్టు” శంకుస్థాపన కార్యక్రమానికి వారిని ఆహ్వానించాను. ఈ ప్రాంతానికి ఉన్న ఛారిత్రక నేపథ్యాన్ని గౌరవ కేంద్ర మంత్రికి… pic.twitter.com/VGBPcNdPCp
— Revanth Reddy (@revanth_anumula) February 12, 2026