కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుంటే రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉండేవి

పదేళ్ల కిందట ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశామ‌ని.. సోనియా గాంధీ చొరవతో ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది.

By Medi Samrat  Published on  7 Oct 2023 1:59 PM GMT
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుంటే రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉండేవి

పదేళ్ల కిందట ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశామ‌ని.. సోనియా గాంధీ చొరవతో ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. కానీ.. కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ అధికారంలోకి వచ్చింద‌ని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. సికింద్రాబాద్ క్రిస్టియన్ రైట్స్ మీటింగ్ లో ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే.. రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉండేవన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సమయంలో జరిగిన సభ చాలా భాగా జరిగిందన్నారు. ఆ ర్యాలీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది యువకులు ఉన్నారన్నారు.

క్రిస్టియన్ సామజిక వర్గం సమాజం తెలంగాణాలో కీలకం అన్నారు. క్రిస్టియన్స్ లో కూడా చాలా మందికి కావలసింది దక్కడం లేదన్నారు. ప్రతీ నలుగురిలో ఒక్కరికి ఉద్యోగం లేదన్నారు. 42 శాతం పట్టభద్రులు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా ఉన్నారని.. 20 నెలల్లో ఆరు శాతం ధరలు పెరిగాయన్నారు. తెలంగాణ లో మోదీ పర్యటన సందర్భంగా.. కేసీఆర్ ను తిడుతున్నారు.. కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్ర‌శ్నించారు. దేశంలో 3.30 కోట్ల మంది క్రిస్టియన్లు ఉండగా.. కేంద్రంలో ఒక్క క్రిస్టియన్ మంత్రి మాత్రమే ఉన్నాడని అన్నారు.

Next Story