కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే నెరవేర్చి తీరుతుంది : సీఎం భూపేష్ భగేల్

బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ గా పనిచేస్తుందని చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ అన్నారు.

By Medi Samrat  Published on  26 Nov 2023 6:45 PM IST
కాంగ్రెస్ మాట ఇచ్చిందంటే నెరవేర్చి తీరుతుంది : సీఎం భూపేష్ భగేల్

బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ గా పనిచేస్తుందని చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్ అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో ఆయ‌న మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరించారని అన్నారు. పేదల అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తానని ప్రధాని మోదీ అన్నారు. కానీ ఇవ్వలేదు మాట తప్పారని అన్నారు. మోదీ హామీలకు ఎలాంటి గ్యారంటీ లేదన్నారు. పదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ఛత్తీస్ గఢ్ లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామ‌ని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నామ‌ని వివ‌రించారు. కాంగ్రెస్ మాట ఇచ్చింది అంటే నెరవేర్చి తీరుతుందన్నారు. తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేస్తామ‌న్నారు. వరంగల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ‌ కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని సీఎం భూపేష్ భగేల్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

Next Story