బీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన చేవెళ్ల ఎమ్మెల్యే

బీఆర్‌ఎస్ నేత‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్‌ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

By Medi Samrat  Published on  28 Jun 2024 4:35 PM IST
బీఆర్‌ఎస్‌కు షాకిచ్చిన చేవెళ్ల ఎమ్మెల్యే

బీఆర్‌ఎస్ నేత‌, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య శుక్రవారం న్యూఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్‌ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి లాంఛనంగా ఆహ్వానించారు. యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావ‌డం విశేషం.

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్‌ఎస్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపులపై మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ఉల్లంఘించిందని ఆ పార్టీ విమర్శిస్తోంది.

ఇదిలావుంటే.. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ వారిని కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల గ్రేట‌ర్ ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌తో భేటీ అయ్యారు. త్వ‌ర‌లోనే గెలిచిన ఎమ్మెల్యేలంద‌రితో కూడా భేటీ కానున్నార‌ని తెలుస్తుంది.

Next Story