తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పు జరిగింది. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్-2ఎ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను 4వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. మార్చి 3న హోలీ పండుగ సెలవు నేపథ్యంలో ఈ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు. మిగతా పరీక్షలన్నీ యథాతథంగా జరుగుతాయని అధికారులు తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల తేదీలు:
ఫిబ్రవరి 25న సెకెండ్ లాంగ్వేజ్
ఫిబ్రవరి 27 న ఇంగ్లీష్
మార్చి 2 – మ్యాథమెటిక్స్ 1A/ బోటని/ పొలిటికల్ సైన్స్
మార్చి 5 – మ్యాథమెటిక్స్ 1B / జూలజీ / హిస్టరీ
మార్చి 9 – ఫిజిక్స్ / ఎకనమిక్స్
మార్చి 12 – కెమిస్ట్రీ / కామర్స్
ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యుల్:
ఫిబ్రవరి 26న సెకెండ్ లాంగ్వేజ్
ఫిబ్రవరి 28న ఇంగ్లీష్
మార్చి 4- మ్యాథమెటిక్స్ 2A/ బోటని/ పొలిటికల్ సైన్స్
మార్చి 6 – మ్యాథమెటిక్స్ 2B / జూలజీ / హిస్టరీ
మార్చి 10 – ఫిజిక్స్ / ఎకనమిక్స్
మార్చి 13 – కెమిస్ట్రీ / కామర్స్