హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2026 - 27 ఫైనాన్షియల్ ఇయర్‌లో 4.13 లక్షల ఇళ్లకు నిధులు రానున్నట్టు అధికారులు తెలిపారు. పీఎంఏవై కింద రాష్ట్రంలో నిర్మించనున్న ఇళ్లకు కేంద్రం తన వాటాను విడుదల చేయనుండటంతో లక్షలాది పేద కుటుంబాలకు ఊరట లభించనుంది.
పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు అందించనుంది. కాగా ఈ పథకానికి మొత్తం రూ.5 లక్షల నగదు విడతల వారీగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పీఎంఏవై-అర్బన్ 2.0 కింద 1.13 లక్షల ఇళ్లు కేటాయించగా, ఇప్పటికే 10 వేల ఇళ్లకు ఆమోదం లభించింది. మిగిలిన ఇళ్ల కోసం వేల కోట్ల రూపాయలు విడుదల కానున్నాయి.