సోలార్ ప్యానెళ్లు పెడితే రూ.కోటి..తెలంగాణలోని 8 గ్రామాలకు కేంద్రం బంపరాఫర్
తెలంగాణలోని ఎనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్‌ను ప్రకటించింది
By - Knakam Karthik |
సోలార్ ప్యానెళ్లు పెడితే రూ.కోటి..తెలంగాణలోని 8 గ్రామాలకు కేంద్రం బంపరాఫర్
తెలంగాణలోని ఎనిమిది గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్‌ను ప్రకటించింది. ఏకంగా కోటి రూపాయల బహుమతిని గెలుచుకునే అద్భుత అవకాశాన్ని కల్పించింది. పౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన 'మోడల్ సోలార్ విలేజ్' పైలట్ ప్రాజెక్టులలో భాగంగా ములుగు జిల్లాలోని ఎనిమిది గ్రామాలను కేంద్రం ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో అత్యధికంగా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్న గ్రామానికి ఈ భారీ నజరాణా దక్కమంది.
దేశవ్యాప్తంగా కరెంటు వాడకం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా 'ప్రధానమంత్రి మార్చ ఘర్ ముస్లి బిజిలీ యోజన్ వరణాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. తెలంగాణలో వెడ్కో (తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. దీని కింద పైలట్ ప్రాజెక్ట్ గా ములుగు జిల్లాలోని ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట మండల కేంద్రాలతో పాటు పస్రా, చల్వాయి, మంగపేట, ఏటూరునాగారం, వెంటాపురం గ్రామాలను ఎంపిక చేశారు. గతేడాది మే నెలలో ఈ పథకంపై అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఫలితంగా, జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 400కు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలను ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఈ పథకం కింద సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ కూడా అందిస్తోంది.
ప్యానెల్ ఏర్పాటుకు ఇంటిపై కనీసం 300 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆసక్తి ఉన్న వినియోగదారులు `pmsuryaghar.gov.in` పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత రెడ్కో, విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి యూనిట్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తారు.