తెలంగాణ రైతులకు శుభవార్త.. రాష్ట్రానికి 50 వేల మెట్రిక్‌ టన్నుల యురియా

యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం ఫలించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీలకు మంత్రి తుమ్మల అభినందనలు తెలిపారు.

By అంజి
Published on : 20 Aug 2025 12:02 PM IST

Central Govt, 50 thousand metric tons of urea, Telangana, Farmers

తెలంగాణ రైతులకు శుభవార్త.. రాష్ట్రానికి 50 వేల మెట్రిక్‌ టన్నుల యురియా

యూరియా కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చేసిన పోరాటం ఫలించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీలకు మంత్రి తుమ్మల అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ వారంలో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ ఆమోదం తెలిపిందన్నారు. కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా షిప్ మెంట్ ప్రారంభం అయిందని, ఈ వారంలో మరో మూడు షిప్ మెంట్ ల ద్వారా యూరియా సరఫరా కు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.

యూరియా కొరత పై పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేసి తెలంగాణ రైతాంగం యూరియా కష్టాలను రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలు దేశానికి తెలిసేలా చేశారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ రాజకీయ స్వార్థం కోసం చేసే కుట్రల పట్ల రైతాంగం ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ కు కేటాయించిన యూరియా సకాలంలో సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష కారణంగానే రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రి తుమ్మల అన్నారు. తెలంగాణ రైతాంగం శ్రేయస్సు కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతాంగం కు ఎల్లపుడు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తుమ్మల హామీ ఇచ్చారు.

Next Story