ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద తెలంగాణలోని 118 పట్టణ ప్రాంతాల్లో 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 910.65 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో కేంద్రం తన వాటాగా రూ. 273.20 కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 637.45 కోట్లు భరించనుంది.
న్యూఢిల్లీలో జరిగిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (CSMC) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంటికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని 'ఇందిరమ్మ ఇళ్లు' నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి మరియు అర్హులైన లబ్ధిదారులకు గృహ వసతి కల్పించడానికి ఎంతో దోహదపడుతుందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ తెలిపారు.