మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రోజు విచారణకు రాలేనంటూ ఎంపీ అవినాశ్ రెడ్డి రాసిన లేఖపై సీబీఐ స్పందించింది. ఈ నెల 19న తమ ముందు హాజరుకావాలంటూ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాశ్ రెడ్డి వెళుతున్న సమయంలో వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సూచించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో, ఈరోజు (మంగళవారం) జరగనున్న విచారణకు తాను హాజరు కాలేనట్లు తెలియజేసేందుకు పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) వైఎస్ అవినాష్ రెడ్డి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి లేఖ రాశారు. తాను గైర్హాజరు కావడానికి ముందుగా నిర్ణయించుకున్న కొన్ని పనులు కారణమని.. నాలుగు రోజుల పొడిగింపును అభ్యర్థించాడు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వెలుపల అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం కొన్ని అత్యవసర పనుల్లో నిమగ్నమై ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు వివరించారు.