ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించినందుకు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు గంగన్న అనే 70 ఏళ్ల వృద్ధుడిపై కేసు నమోదు చేశారు. గంగన్న, కాలనీలోని పలువురు నివాసితులతో కలిసి నిరసన చేపట్టారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డిపై పరుష పదజాలంతో బహిరంగంగా తన నిరాశను వ్యక్తం చేశారు. ఆయన బూతులు తిట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు చర్యలకు దిగారు. పోలీసులు అతనితో పాటు మరికొంత మంది కాలనీ నివాసితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. పలువురు సొంత ఇళ్లను, స్థలాలను పోగొట్టుకున్నారు. చాలా మంది బాధితులు తమ బాధను, కోపాన్ని బహిరంగంగా వెళ్లగక్కారు.