కాంగ్రెస్ దూకుడు.. నేడు 11 నియోజకవర్గాల్లో రాహుల్, ప్రియాంక, రేవంత్‌ల ప్రచారం
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడింది. దీంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
By Medi Samrat Published on 25 Nov 2023 8:34 AM ISTతెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడింది. దీంతో అన్ని పార్టీల నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అధికార బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్ కూడా ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ క్రమంలో నేడు తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో కీలక నేతలు రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డిలు పర్యటించనున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి..
నేడు మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్న రాహుల్..
రాహుల్ నాందేడ్ నుండి ఛాపర్ లో బోధన్ కు వస్తారు. 12.10 కి బోధన్ లో పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. 2 గంటలకు అదిలాబాద్ బహిరంగ సభకి హాజరవుతారు. సాయంత్రం 4 గంటలకు వేములవాడ బహిరంగ సభలో మాట్లాడుతారు. అనంతరం వేములవాడ నుండి ఛాపర్ లో బేగంపేటకు వస్తారు.
నేడు ప్రియాంక రెండ వరోజు పర్యటన
నేడు తెలంగాణలో ప్రియాంక రెండ వ రోజు పర్యటన కొనసాగనుంది. ఉమ్మడి ఖమ్మంలో ప్రియాంక పర్యటించనున్నారు. 11 గంటలకు ఖమ్మం, పాలేరులో ప్రియాంక రోడ్ షో లో పాల్గొంటారు. 1.30 గంటలకు సత్తుపల్లిలో కార్నర్ మీటింగ్ లో ప్రియాంక మాట్లాడుతారు. 2.40 గంటలకు మధిర కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. జుక్కల్, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో రేవంత్ పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు జుక్కల్ బహిరంగసభ, ఉదయం 11.30 గంటలకు షాద్ నగర్ బహిరంగసభ, మధ్యాహ్నం 12.30 గంటలకు ఇబ్రహీంపట్నం బహిరంగసభ, మధ్యాహ్నం 2 గంటలకు కల్వకుర్తి బహిరంగసభలలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.