పొన్నాల వస్తే చాలా సంతోషం : మంత్రి కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

By Medi Samrat  Published on  13 Oct 2023 2:01 PM GMT
పొన్నాల వస్తే చాలా సంతోషం : మంత్రి కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు. కాంగ్రెస్‌లో తనకు అవమానం జరిగిందని లేఖలో వివరించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితం నాది. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చా. 45 ఏళ్ల తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరంగా ఉందని అన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే.. నా విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదని పొన్నాల భావోద్వేగానికి గురయ్యారు. ఆయన బీఆర్ఎస్ లోకి చేరబోతున్నారనే ప్రచారం సాగుతూ ఉంది.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. పొన్నాల మా పార్టీలోకి వస్తానంటే సంతోషం. రేపే ఆయన ఇంటికి వెళ్తానన్నారు. నేనే ఆయన్ని దగ్గరుండి పార్టీలోకి ఆహ్వానిస్తానని కేటీఆర్‌ చెప్పారు. ఈ నెల 16వ తేదీన పొన్నాల కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని ప్రచారం సాగుతోంది. కేటీఆర్ మాట్లాడుతూ అధికారుల బదిలీలను.. బదిలీలలుగా గానే చూస్తామన్నారు. ప్రజలు ఓటేసేటప్పుడు సీఎం ఎవరుంటారు అని చూస్తారని.. కేసీఆర్ పాలన, పని తీరు పైనే ప్రజలు తీర్పు ఇస్తారన్నారు. మేము చేసింది చెప్పుకుంటామని అన్నారు. గతం లో వచ్చినట్టే మాకు 88 సీట్లు రావచ్చన్నారు. హుజురాబాద్ లో కూడా మేమే గెలుస్తున్నామని జోస్యం చెప్పారు కేటీఆర్. ఈటల రాజేందర్ గజ్వెల్ లోనే కాదు ఇంకా 50 చోట్ల పోటీ చేసినా అభ్యంతరం లేదన్నారు. బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులు లేక ఆయన అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతూ ఉండొచ్చని కేటీఆర్ సెటైర్లు వేశారు.

Next Story