తెలంగాణ భవన్‌ జనతా గ్యారేజ్‌లా మారింది: కేటీఆర్

బీఆర్ఎస్ రజతోత్సవ సభ పార్టీ చరిత్రలో ఒక అతిపెద్ద బహిరంగ సభ కాబోతున్నది..అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.

By Knakam Karthik
Published on : 23 April 2025 4:03 PM IST

Telangana, Warangal District, Brs, Ktr, Brs Sabha

తెలంగాణ భవన్‌ జనతా గ్యారేజ్‌లా మారింది: కేటీఆర్

ఈ నెల 27న జరగబోతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ పార్టీ చరిత్రలో ఒక అతిపెద్ద బహిరంగ సభ కాబోతున్నది..అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో సభ ఏర్పాట్లను పరిశీలించారు.

అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అస్థిత్వాన్ని హిమాలయాల స్థాయికి తీసుకుపోయిన ఘనత కేసీఆర్ ది. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారంతా గులాబీ జెండా, తెలంగాణ భవన్ వైపు చూస్తున్నారని బీఆర్ఎస్ ఓ జనతా గ్యారేజీలా మారింది. వరంగల్ లో అనేక మహాసభలు నిర్వహించుకున్నామని బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు వరంగల్ మళ్లీ వేదిక అయింది. సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 40 వేల వాహనాలు వచ్చినా పార్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని, పది లక్షల వాటర్ బాటిల్స్, పది లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఎటు వైపు నుంచి వచ్చే వాహనాలకు అటు వైపే పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దాదాపు 100 డాక్టర్స్ టీమ్స్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

బీఆర్ఎస్ చరిత్రలో ఎల్కతుర్తి సభ అతిపెద్ద బహిరంగ సభ కాబోతుంది. కేసీఆర్‌ను చూసేందుకు ఆయన మాట వినేందుకు గ్రామగ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చేందుకు ఎదురు చూస్తున్నారు. రైతులు ఎండ్లబండ్లపై సభకోసం తరలివస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను, బీజేపీ పార్టీ తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ఈ సభలో కేసీఆర్ వివరిస్తారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాటానికి జరుగుతున్న సభ కాదు.. శాంతియుతంగా బీఆర్ఎస్ వార్షికోత్సవం చేసుకుంటున్నాం..అని కేటీఆర్ తెలిపారు.

Next Story