ఆ విషయంలో కాంగ్రెస్‌కు కేటీఆర్ మద్దతు

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు.

By Medi Samrat  Published on  30 Dec 2024 6:37 PM IST
ఆ విషయంలో కాంగ్రెస్‌కు కేటీఆర్ మద్దతు

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు. మన్మోహన్‌సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్‌ను నేరుగా లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రభుత్వంలోకి తీసుకొచ్చారన్నారు కేటీఆర్.

1991లో తన మొదటి బడ్జెట్ ప్రసంగంలో భారతదేశం గురించి ప్రపంచం మొత్తం వినేలా చేసిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్. ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ భారతదేశంలో అనేక సంస్కరణల వెనుక ఉన్నారన్నారు. మన్మోహన్ సింగ్ సింపుల్ లివింగ్- హై థింకింగ్ కు పర్యాయపదంగా ఉన్నారన్నారు. నేటి రాజకీయాల్లో విధేయత చాలా అరుదు, కానీ చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న గొప్ప నాయకుడు ఆయన అని కేటీఆర్ అన్నారు.

Next Story