తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ
తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సీనియర్ నేతలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
By Knakam Karthik
తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ
తెలంగాణలో రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సీనియర్ నేతలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిటీ అన్ని జిల్లాల్లోనూ పర్యటించనుంది. రాష్ట్రంలో పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, దుర్భర వ్యవసాయ రంగ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. పూర్తి స్థాయిలో అధ్యయనం తర్వాత రెండు వారాల తర్వాత నివేదిక రూపకల్పన చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ మంత్రి, కమిషన్‌కు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు అధ్యయన కమిటీ నివేదిక సమర్పించనుంది.
రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ అధ్యయన కమిటీ✳️ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో 9 మంది సీనియర్ నేతలతో కమిటీ.✳️ రెండు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్న కమిటీ.✳️ పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, దుర్భర వ్యవసాయరంగ పరిస్థితులపై అధ్యయనం.✳️… pic.twitter.com/nbVfQz2xXj
— BRS Party (@BRSparty) January 20, 2025
రాష్ట్రంలో ఆందోళనకర స్థాయికి చేరిన రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితుల కోసం అధ్యయనానికి ఈ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు దారి తీస్తున్న ప్రధానమైన కారణాలతో పాటు రాష్ట్రంలో గత ఏడాది కాలంలో వ్యవసాయ సంక్షోభానికి దారి తీసిన పరిస్థితులను పరిశీలించి ఒక రిపోర్ట్‌ను తయారు చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో సన్న, చిన్న కారు, కౌలు రైతులను కలిసి వారి సమస్యలను కమిటీ తెలుసుకుంటుందని కేటీఆర్ వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నాలుగు వందలకు పైగా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్న ఆందోళనకర పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోన్న రైతు వ్యతిరేక విధానాల కారణంగానే రాష్ట్ర వ్యవసాయ రంగం చిన్నాభిన్నమైందని కేటీఆర్ ఆరోపించారు.