కవిత బాధితురాలు.. నిందితురాలు కాదు: ఎంపీ రవిచంద్ర

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్టు చేసిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు

By Medi Samrat  Published on  22 March 2024 9:36 AM GMT
కవిత బాధితురాలు.. నిందితురాలు కాదు: ఎంపీ రవిచంద్ర

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్టు చేసిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేసును టీవీ సీరియల్స్ మాదిరిగా రెండేళ్లు సాగదీసి ఎన్నికల వేళ ఇప్పుడు తెరపైకి తెచ్చారని ఈడీ వైఖరిని ఎండగట్టారు. ఈడీ 2004 నుండి 2014 వరకు కేవలం 200 కేసులు మాత్రమే నమోదు చేస్తే.. బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌ 2014 నుండి 2024 వరకు 2,954 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ కేసులో కవిత బాధితురాలే కానీ నిందితురాలు కాదన్నారు. ఎన్నికల టైంలో ప్రత్యర్థులను వేధించడానికి బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు నుండి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆశాబాశం వ్యక్తం చేశారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాజ‌కీయ క‌క్ష‌లో భాగంగానే ఎమ్మెల్సీ క‌విత‌ను అరెస్టు చేశార‌ని ఎంపీ నామా నాగేశ్వ‌ర్ రావు అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర‌ల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు. క‌విత‌ను అరెస్టు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. గ‌తంలో శివ‌సేన పార్టీపై కూడా బీజేపీ కుట్ర‌లు చేసి.. పార్టీని విచ్ఛిన్నం చేసింద‌న్నారు. బీజేపీ త‌న పాల‌సీల‌ను ఆయా రాష్ట్రాల‌కు అనుకూలంగా మార్చుకుంద‌ని ఆరోపించారు. క‌విత‌ను ఓ మహిళ అని కూడా చూడకుండా అరెస్ట్ చేశారు అని ఎంపీ నామా మండిప‌డ్డారు.

Next Story