తెలంగాణలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమా? అనుముల రాజ్యాంగమా?: కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 14 April 2025 4:17 PM IST

Telangana, Kamareddy District, Brs Mlc Kavitha, Congress Government, Cm Revanthreddy,

తెలంగాణలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమా? అనుముల రాజ్యాంగమా?: కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.తెలంగాణలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగమా? లేక అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగమా? అని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో దళితులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

ఈ ఘటనపై ఎక్స్ వేదికగా కవిత ఇలా రాసుకొచ్చారు...అంబేద్కర్ జయంతి రోజున దళితులపై ఇంతటి కర్కశత్వమా? దళితుల బట్టలు విప్పి అరెస్టు చేసేంత ధైర్యం పోలీసులకు ఎవరిచ్చారు? ఎవరి అండదండలు చూసుకొని పోలీసులు విర్రవీగుతున్నారు. దళితులను అవమానించడమే ప్రజా పాలనా? బట్టలు విప్పి మరీ దళితులను అరెస్టు చేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలి. బాధ్యులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇది శాంతిభద్రతల సమస్య కాదని కేవలం లక్ష్యంగా చేసుకున్న అణచివేత అని.. ఎమ్మెల్సీ కవిత ఎక్స్‌లో రాశారు.

Next Story