దిల్ రాజుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్‌

సినీ నిర్మాత దిల్ రాజుపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు.

By Medi Samrat  Published on  9 Jan 2025 6:03 PM IST
దిల్ రాజుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫైర్‌

సినీ నిర్మాత దిల్ రాజుపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆంద్రప్రదేశ్‌లోని ప్రజలు సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని దిల్ రాజు అన్నారని, తెలంగాణ ప్రజలు సినిమాలు చూడకుండా కల్లు, మటన్‌కే ప్రాధాన్యత ఇస్తారని తెలంగాణ ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం చాలా తప్పని దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో సినిమాలకు సందడే లేదని దిల్ రాజు నమ్మితే సినిమాలు తీయడం మానేసి రాష్ట్రంలో కల్లు, మటన్ షాపులు తెరచుకోవాలని దేశపతి శ్రీనివాస్ సూచించారు. శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. దిల్ రాజు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్రంలోని ప్రజలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని అన్నారు.

“సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ప్రమోషన్స్ లో నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ, 'ఆంధ్రాలో సినిమాకు ఓ వైబ్ ఇస్తారు. తెలంగాణలో కల్లు, మటన్ కు వైబ్ ఇస్తాం' అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు తెలంగాణ ప్రముఖులు, నేతలు విమర్శలు గుప్పించారు.

Next Story