జాబ్ క్యాలెండర్‌పై చర్చ జరపండి.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

జాబ్ క్యాలెండర్‌పై చర్చ జరగాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో నిరసనకు దిగారు

By Medi Samrat  Published on  24 July 2024 9:30 AM GMT
జాబ్ క్యాలెండర్‌పై చర్చ జరపండి.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

జాబ్ క్యాలెండర్‌పై చర్చ జరగాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో నిరసనకు దిగారు. ఉభయ సభల్లో ఉద్యోగ క్యాలెండర్‌కు సంబంధించి పార్టీ వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు చెరో ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకున్నప్పటికీ ఏ పార్టీ కూడా రాష్ట్రాభివృద్ధికి ఒక్క పైసా కూడా తీసుకురాలేకపోయాయని మండిపడ్డారు.

ఇక కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ అసెంబ్లీలో ఈరోజు చర్చ జరిగింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్న చర్చను తాము పూర్తిగా సమర్థిస్తున్నామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో మనకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ అనే పదం కూడా రాలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అందుకు అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణమని కేటీఆర్ అన్నారు.

Next Story