హైదరాబాద్: తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సభ్యులు డిమాండ్ చేయడంతో గురువారం అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభ ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్‌ఎస్ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో హౌస్ నుంచి బయటకు వెళ్లే ముందు నిరాహార దీక్షకు చేశారు.
ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ కించపరిచారంటూ అసెంబ్లీ ఆవరణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. అంతకుముందు సీఎం ఛాంబర్ ఎదుట ఎమ్మెల్యేలు బైఠాయించగా అక్కడి నుంచి మార్షల్స్ వారిని అసెంబ్లీ ప్రాంగణంలోకి తీసుకొచ్చారు. అక్కడ మళ్లీ బైఠాయించడంతో బయటకు ఎత్తుకుని తీసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా వ్యాన్ ఎక్కించారు. కాగా వ్యాన్‌లో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.