పంటలు ఎండిపోతుంటే అందాల పోటీలా..అని తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీ వరకు నినాదాలు చేస్తూ సభలోకి వెళ్లారు. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ కాక, రైతుబంధు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి, కృష్ణా నదిలో నీళ్లు సక్రమంగా వాడుకోలేక పంటలు ఎండబెడుతున్నాయి. ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కళ్లు తెరిపించేందుకు ఎండిపోయిన వరితో నిరసన తెలిపాం..అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
సకాలంలో వర్షాలు పడినా, ప్రాజెక్టుల్లో నీళ్లు నింపలేదు. మేడిగడ్డ ఎండబెట్టి సిగ్గులేకుండా ఇసుక అమ్మకాలు చేస్తుంది. 36 శాతం కృష్ణాజలాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించుకుంటే.. రేవంత్ సర్కార్ కనీసం 22 శాతం కూడా వాడలేదు. కిందకి నీళ్లు వదిలి చంద్రబాబు మీద ప్రేమతో ఇక్కడి పంటలు ఎండబెట్టింది. వరి చేలలో గొర్రెలు మేస్తున్నాయి. ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయాయో ఆ రైతులను ఆదుకోవాలి. చెరువులు నింపలేని తెలివి తక్కువ తనం కాంగ్రెస్‌ది. పాడైపోయిన బ్యారేజ్ రిపేర్ చేయకుండా తెలివి తక్కువ తనంతో కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గులేని చర్యలకు పాల్పడుతోంది. పంటలు ఎండిపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తాం. ఎండిన పంట పొలాలకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని. కేటీఆర్ అన్నారు.