దానం టీషర్ట్‌, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసు: పాడి కౌశిక్

ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు

By Medi Samrat  Published on  3 Aug 2024 4:37 PM IST
దానం టీషర్ట్‌, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసు: పాడి కౌశిక్

ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. దానం నాగేందర్ నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. నువ్వు మొగోడివైతే రా చూసుకుందాం. ఎక్కడో స్పాట్ చెప్పు రావడానికి నేను రెడీ.. అంటూ సవాల్ విసిరారు. దానం నాగేందర్ మాటలు దారుణంగా ఉన్నాయని, సభలో రూల్స్‌కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే సీటు నుంచి మాట్లాడారని పాడి కౌశిక్ తెలిపారు.

దానం నాగేందర్ నువ్వు తాజ్ క్రిష్ణ హోటల్‌కు టీషర్ట్‌, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసని కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. ఎవరూ భయపడటం లేదన్నారు. కేసిఆర్ పెట్టిన బిక్షపై నువ్వు ఎమ్మెల్యే అయ్యావు.. దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువాలని సవాల్ విసిరారు పాడి కౌశిక్. గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టిన సంగతి మరచిపోవద్దన్నారు.

Next Story