వారికి అండగా ఉంటాం: కేటీఆర్

మూసీ నది అభివృద్ధి పనుల్లో భాగంగా నష్టపోయిన వారికి సహాయం చేసేందుకు ముందుకు వస్తామని బీఆర్ఎస్ తెలిపింది

By Medi Samrat  Published on  2 Oct 2024 5:37 PM IST
వారికి అండగా ఉంటాం: కేటీఆర్

మూసీ నది అభివృద్ధి పనుల్లో భాగంగా నష్టపోయిన వారికి సహాయం చేసేందుకు ముందుకు వస్తామని బీఆర్ఎస్ తెలిపింది. బాధిత కుటుంబాలకు తెలంగాణ భవన్‌లో పార్టీ న్యాయవాద బృందం అందుబాటులో ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ప్రకటించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) చేపట్టిన కూల్చివేతల కారణంగా మూసీ, ఇతర ప్రాంతాల బఫర్ జోన్‌లలో నివసించే వ్యక్తులు న్యాయ సహాయం కోసం తమను సంప్రదించవచ్చని కేటీఆర్ తెలిపారు.

అన్ని అనుమతులు ఉన్న వారి ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు కేటీఆర్. బీఆర్‌ఎస్ బాధితులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గురువారం ఎల్బీనగర్‌లో మూసీనది పరివాహక ప్రాంతంలోని బాధితులను పరామర్శించనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. మంగళవారం చాదర్‌ఘాట్‌లో మూసీ నిర్వాసితులను కలిసేందుకు వెళ్లిన కేటీఆర్ వాహనాలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

Next Story