సింగరేణి కుంభకోణం అంశంపై బీఆర్ఎస్ నాయకులు మంగళవారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలవనున్నారు. సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రుల పాత్ర ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఈ అంశంపై కేటీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ బృందం రేపు గవర్నర్‌ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేయనున్నారు. కేటీఆర్ వెంట సీనియర్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలవనున్నారు.