ఎందుకీ సంబరాలు.. వారికి నిరాశే మిగిల్చినందుకా?: కేటీఆర్
జూన్‌లో వేయాల్సిన రైతు భరోసా.. జులై వచ్చిననా రైతుల ఖాతాలో జమ కాలేదని కేటీఆర్ అన్నారు.
By అంజి Published on 19 July 2024 8:39 AM GMTఎందుకీ సంబరాలు.. వారికి నిరాశే మిగిల్చినందుకా?: కేటీఆర్
జూన్‌లో వేయాల్సిన రైతు భరోసా.. జులై వచ్చిననా రైతుల ఖాతాలో జమ కాలేదని కేటీఆర్ అన్నారు. కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వలేదని ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌ను కేటీఆర్ దుయ్యబట్టారు. ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్ చేసి ఇప్పుడు నిధులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఎందుకీ సంబరాలు.. అర్హులైన లబ్ధిదారులకు రుణమాఫీ కాకుండా, మెజార్టీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
''ఊరించి.. ఊరించి.. ఏడునెలలు ఏమార్చి చేసిన మీ రుణమాఫీ తీరు చూస్తే తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన సామెత ఒక్కటే “ చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ”. రుణమాఫీ అయిన రైతులకన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..! రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయి'' అని కేటీఆర్ అన్నారు. అన్నివిధాలా అర్హత ఉన్నా.. ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోళ్లు లేరని, రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోళ్లు లేరని అన్నారు.
అర్హులైన లబ్దిదారులు.. రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. నలభై లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ? ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా ? అంటూ నిలదీశారు. రెండు సీజన్లు అయినా రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలే, జూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలేదన్నారు.