ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ని సీఎం చేయ‌డ‌మే మ‌న‌ ధ్యేయం : బానోత్ మదన్ లాల్

త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించుకోవాలని

By Medi Samrat  Published on  5 Sept 2023 4:57 PM IST
ముచ్చటగా మూడోసారి కేసీఆర్‌ని సీఎం చేయ‌డ‌మే మ‌న‌ ధ్యేయం : బానోత్ మదన్ లాల్

త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించుకోవాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ శాసనసభ్యుడు బానోత్ మదన్ లాల్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం చూసి దేశంలోని పలు రాష్ట్రాల ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాలు కావాలని కోరుకుంటున్నారు అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. పార్టీలో ఎవరికీ ఎలాంటి తార‌త‌మ్యాలు లేవని.. మనందరం బీఆర్ఎస్‌ కుటుంబమని.. అంతా కలిసికట్టుగా ఉందామ‌ని అన్నారు. మీ అందరిలోనూ ఒకడిగా ఉంటూ మీకు అండగా ఉంటానని మదన్ లాల్ అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరం గడపగడపకూ వివరిస్తూ.. కేసీఆర్ సంక్షేమాన్ని తెలుపుతూ.. బీఆర్ఎస్ పార్టీ గెలుపు ధ్యేయంగా ముందుకు పోదామని అన్నారు. మీ అందరి సహకారం.. మీ అందరి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేనని.. మీ అందరి ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నన్ను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని.. మీ ఆశీస్సులకు ఎప్పుడూ రుణపడి ఉంటాన‌ని పేర్కొన్నారు.

Next Story