చెప్పు చూపించిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్
మాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 5 Feb 2024 8:00 PM ISTమాజీ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్ రేవంత్ రెడ్డిపై అనుచిత పదాలు వాడారు. ఇలా మాట్లాడాలంటే తనకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు. కేసీఆర్‌ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలేగాడు అంటూ దూషించారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని, సంస్కారం అడ్డువచ్చి ఆగుతున్నామని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి... తన పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలని సూచించారు. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామని అంటున్నారని ఆరోపించారు.
రండ రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టాలని ఉంది కానీ సంస్కారం అడ్డు వస్తుంది - మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ @balkasumantrs 🔥🔥🐯@KTRBRS@BRSHarish.#balkasuman #BRSParty #ktr #KCR #RandaRevanthReddy #RandaRevanth pic.twitter.com/KM93b4WEJ1
— KTR Fan Army (@KTRBRS13) February 5, 2024
ఇక కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో నిరసనలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం సూర్యాపేటలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.