కౌన్సిలర్లకు నా సెల్యూట్.. ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం : కేటీఆర్

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను BRS కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయం.. ఇది ప్రజాస్వామ్య జయకేతనం అని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పేర్కొన్నారు.

By -  Medi Samrat
Published on : 4 April 2026 9:20 PM IST

కౌన్సిలర్లకు నా సెల్యూట్.. ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం : కేటీఆర్

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను BRS కైవసం చేసుకోవడం ఎంతో హర్షణీయం.. ఇది ప్రజాస్వామ్య జయకేతనం అని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమ‌న్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడికి, పార్టీ నాయకులు, శ్రేణులకు అభినందనలు తెలిపారు.

ఈ మేర‌కు ఎక్స్‌లో ఆయ‌న‌.. అడ్డదారుల్లో వీటిని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా వేటికి లొంగకుండా మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్లకు ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నా.. క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు మిత్రపక్షమైన సిపిఐ కామ్రేడ్లు అడుగడుగునా కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకం.. అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావులేదని ఈ తీర్పు తేల్చిచెప్పింది. రెండున్నరేళ్లలోనే పీకల్లోతు ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఈ ఫలితాలు నలుదిశలా చాటి చెప్పాయి. అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఈ విజయాలు అందించిన స్ఫూర్తిని కొనసాగిద్దాం.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అడుగడుగున విధ్వంసం చేస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదాం అని పోస్టు చేశారు.

Next Story