కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన బీసీ కథనభేరీ సభపై ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయుటకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ డిమాండ్ చేస్తూ నిర్వహించ తలపెట్టిన బీసీ కథనభేరి కార్యక్రమం నిర్వహించుటకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే భారీ వర్ష సూచనల నేపథ్యంలో కరీంనగర్ సభ వాయిదా వేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తేదీ 14, 15, 16, 17 రోజులలో అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు ప్రభుత్వ వాతావరణ శాఖ సూచనలు మేరకు, ప్రభుత్వ ముందస్తు హెచ్చరికల దృష్టిలో ఉంచుకుని ఈ నెల 14 గురువారం రోజున భారత రాష్ట్ర సమితి పూర్వపు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బీసీ కథన బేరి వాయిదా వేస్తున్నాం. వాతావరణం అనుకూలించిన తర్వాత నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తాం. దీనిని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గమనించాలని గంగుల కమలాకర్ పేర్కొన్నారు