శ్రీ తేజ్ ఆరోగ్యం ఎలా ఉందంటే..
డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఆసుపత్రి పాలైన ఎనిమిదేళ్ల శ్రీ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Dec 2024 8:52 PM ISTడిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఆసుపత్రి పాలైన ఎనిమిదేళ్ల శ్రీ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు. KIMS సికింద్రాబాద్ ఆసుపత్రిలో చీఫ్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ చేతన్ R ముండాడ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ తేజ జ్వరం వచ్చే చిక్కులు తగ్గాయని.. వైట్ బ్లడ్ సెల్స్.. మిగితా సెల్స్ అన్ని ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఫీడ్ తీసుకోగలుగుతున్నాడని.. నాడీ వ్యవస్థ పనితీరు ఇప్పటికీ అలాగే ఉందని వెల్లడించారు.
డిసెంబర్ 4న సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ల మహిళ మరణించగా.. ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీ తేజ్‌ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అంతకుముందు పోలీసు సిబ్బంది, ప్రేక్షకులు అక్కడికక్కడే CPR నిర్వహించారు. ఇది శ్రీ తేజ్‌వైద్య చికిత్సలో కీలకపాత్ర పోషించింది.
ఈ ఘటన తర్వాత మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని వివిధ సెక్షన్ల కింద అల్లు అర్జున్, అతని భద్రతా బృందం, థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
ఇటీవల అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆసుపత్రిని సందర్శించారు. అల్లు అర్జున్ బృందం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. సోమవారం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ శ్రీ తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.50 లక్షల చెక్కును అందజేశారు.