బీజేపీది గాడ్సే ఆలోచనా విధానం: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

బీజేపీది గాడ్సే ఆలోచన విధానమని మల్లు రవి ఆరోపించారు.

By Knakam Karthik  Published on  29 Jan 2025 6:00 PM IST
Telangana, Cm Revanth, MP Mallu Ravi, Congress, RahulGandhi, Bjp, Amitshah

బీజేపీది గాడ్సే ఆలోచనా విధానం: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

రాహుల్‌గాంధీ ప్రధాని చేసే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తన భుజాన వేసుకోవాలని కాంగ్రెస్ నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. బీజేపీ, మోడీ ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్‌ను అవమానించేలా మాట్లాడారని అన్నారు. అమిత్ షాను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ క్షమాపణ చెప్పమన్నా.. చెప్పలేదని విమర్శించారు. బీజేపీది గాడ్సే ఆలోచన విధానమని మల్లు రవి ఆరోపించారు. రాహుల్ గాంధీ రాజ్యంగ పరిరక్షణ కోసం పోరాట చేస్తూ.. మహాత్మ గాంధీ ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్నాడని అన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డిని అందరూ సవ్యసాచి అని పిలుస్తారంటూ ఎంపీ మల్లు రవి చెప్పారు. ఆయన సీఎం అయ్యాక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఒక వైపు, రాజకీయాలు ఇంకో వైపు చేస్తున్నాడని అన్నారు. అభివృద్ధి ఎంత అవసరముందో రాజకీయాలు అంతే ముఖ్యమని తెలిపారు. దేశంలో జాతీయ నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్నాడని రేవంత్‌ను పొగిడారు ఎంపీ మల్లు రవి.

తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది రూ.12 వేల కోట్లు మాత్రమే అంటోన్న కేటీఆర్.. చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నారు. హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందన్న ఆయన, అందుకే దావోస్‌లో తెలంగాణకు లక్షా 78 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు.

Next Story