తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఖాయమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మారారంటే, ఇక మారేది ముఖ్యమంత్రేనని అన్నారు. పార్టీ ఇన్చార్జిగా రాహుల్ గాంధీ టీమ్ నుంచి పెట్టినట్లు చెప్పారు.
సీఎం ఛేంజ్ అనే మిషన్‌ను మీనాక్షి నటరాజన్‌కు అప్పగించారు. సీఎంను మార్చేందుకు ఆమె గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్‌లో ముఖ్యమంత్రి మార్పు ఖాయం. వనపర్తి సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే, ఇంకా పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే.. ఢిల్లీ నుంచి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదం ఆయనకు ముఖ్యం..అని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా గాడి తప్పింది. మంత్రుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది. ఒక్క మంత్రి కూడా సీఎంని ఖాతరు చేయడంలేదు" అని వ్యాఖ్యానించారు.