బీఆర్ఎస్ మద్దతుతో ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది.

By -  Knakam Karthik
Published on : 5 April 2026 2:09 PM IST

Telangana, NirmalDistrict, Khanapur, MunicipalElections, BJP, BRS

బీఆర్ఎస్ మద్దతుతో ఖానాపూర్ మున్సిపల్ పీఠం బీజేపీ కైవసం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక ఉత్కంఠకు తెరపడింది. అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చేతులు కలపడంతో బీజేపీకి చెందిన అంకం మౌనిక చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీనికి ప్రతిగా వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్‌కు చెందిన మహమ్మద్ షోయబ్ దక్కించుకున్నారు.

మొత్తం 12 మంది సభ్యులున్న కౌన్సిల్‌లో బీఆర్ఎస్, బీజేపీలకు నాలుగేసి సీట్లు, కాంగ్రెస్‌కు మూడు, స్వతంత్ర అభ్యర్థికి ఒక సీటు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో కాంగ్రెస్ బలం ఐదుకు చేరినప్పటికీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీజేపీకి మద్దతు తెలపడంతో ఏడుగురి బలంతో బీజేపీ విజయం సాధించింది.

Next Story