కేసీఆర్ ఫాం హౌస్‌ను జాతికి అంకితం చేస్తారా..? : రఘునందన్ రావు

ఎద్దు ఏడ్చిన ఏవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

By Medi Samrat  Published on  30 Sept 2024 3:20 PM IST
కేసీఆర్ ఫాం హౌస్‌ను జాతికి అంకితం చేస్తారా..? : రఘునందన్ రావు

ఎద్దు ఏడ్చిన ఏవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. రైతు దీక్ష నుంచి ఆయ‌న మాట్లాడుతూ.. గత కేసీఆర్ పాలనలో వేల మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు.. గత ప్రభుత్వ తప్పిదాలె కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ఎకరానికి భూసార పరీక్షలు చేయలేదు. రైతులకు పసల్ భీమా అందించడంలో కేసీఆర్ విఫలం అయ్యారు, నేడు రేవంత్ రెడ్డి పాలన విఫలం అయ్యిందన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ ను జాతికి అంకితం చేస్తారా..? లేక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలన్నారు.

లక్ష కోట్ల ప్రజా ధనాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేశారని.. లక్ష కోట్ల దుర్వినియోగంపై నాడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి సీట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని మాట ఇచ్చారు.. ఏమయ్యింది..? అని ప్ర‌శ్నించారు. లక్ష కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని రేవంత్ రెడ్డి కొత్త నాటాకాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు రైతులను దోపిడీకి గురిచేశాయన్నారు. పదేళ్లలో కేసీఆర్ ఎంత బ‌ద్నాం అయ్యారో పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతే బ‌ద్నాం అయ్యిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు బోగస్ హామీలుగా మిగిలాయి.. తెలంగాణలో రైతుల సమస్యలు తీర్చడం బీజేపీకే సాధ్యమవుతోందన్నారు.

Next Story