సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత విధానాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రాన్ని తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో రీజినల్ రింగ్ రోడ్డుకు అన్యాయం చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ద్వారా విలువైన పంట పొలాలు కోల్పోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో తప్పులను సరిదిద్దుతామని చెప్పి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కాంగ్రెస్ హామీలు వారికి ఉరితాళ్లుగా మారుతున్నాయి..అని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
రీజినల్ రింగ్ రోడ్డు విషయంలో ప్రియాంక గాంధీతో చెప్పిన మాటలను సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అమలు చేయడంలేదని ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు.లోపాభూయిష్టంగా డీపీఆర్‌ను రూపొందించారు. ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తే సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. బీజేపీపై విమర్శలు చేస్తున్నారు..అని ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధికి మోడీ సర్కార్ నిధులు కేటాయిస్తుంది. పెంకమీద నుంచి పొయిలో పడ్డామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. బీఆర్‌ఎస్ పాటించిన విధానాలనే.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది..అని ఎంపీ లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.