కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారు: ఈటల
తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
By Knakam Karthik
కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారు: ఈటల
తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు తప్ప పాలకమండలి ఎక్కడా లేవు అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసిన కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేయడం లేదు. పంచాయతీ పని చేసే సఫాయి కార్మికుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వల్లకాడిగా మారాయి. సాక్షాత్తు కాంట్రాక్టర్లు ఆర్థిక మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. ఉద్యోగులు పదవీ విరమణ పొందితే బెనిఫిట్స్ రావడం లేదు. చివరికి ఎంపీలు దగ్గరికి వెళ్లి కమిషన్లు ఇచ్చే పరిస్థితి ఉంది..అని ఎంపీ ఈటల ఆరోపించారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దిగి రావాలి. ఇందిరమ్మ కమిటీలు వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇల్లును కేటాయిస్తున్నారు. నిజమైన లబ్దిదారులకు ఇల్లు మంజూరు చేయాలి. అకాల వర్షాల వల్ల ధాన్యం నీటి పాలయింది. ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన రైతులను ఆదుకోవాలి. కాంగ్రెస్ సుద్ద పార్టీ అయితే 48 ఏళ్ల పాటు పాలించారు కదా..ఎందుకు కులగణన చేయలేదు? ఏ రాజ్యాంగాన్ని పట్టుకుని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడో, ఆ రాజ్యాంగం రాసిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అవమానించింది...అని ఎంపీ ఈటల విమర్శించారు.