బీజేపీ ఎంపీల ఓటమి.. కాంగ్రెస్ ఎంపీల సూపర్ విక్టరీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  3 Dec 2023 5:45 PM IST
బీజేపీ ఎంపీల ఓటమి.. కాంగ్రెస్ ఎంపీల సూపర్ విక్టరీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలయ్యారు. కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, కోరుట్ల నుంచి నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, బోథ్‌ నుంచి ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు ఓటమి పాలయ్యారు. బీజేపీ ఎంపీలు ముగ్గురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. కరీంనగర్‌ నుంచి ఎంపీ బండి సంజయ్‌, మంత్రి గంగుల కమలాకర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. కోరుట్లలో ఎంపీ అర్వింద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌ మీద, బోథ్‌ నుంచి ఎంపీ సోయం బాపూరావు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అనిల్‌ జాదవ్‌ చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి గెలుపొందడం విశేషం. బీజేపీ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు ఓటమి పాలవడం.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీచేసిన ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం ఆసక్తికరం.

Next Story