హైదరాబాద్‌లో కొన్ని చోట్ల ఉద్రిక్తతల మినహా ప్రశాంతంగా హోలీ ముగిసింది. అయితే మార్చి 15వ తేదీ శనివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్.. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ రాజకీయ ప్రయోజనాల కోసం హైదరాబాద్ లో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే, హైదరాబాద్ ఎంపీ దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరించారు. ఒవైసీ పిచ్చివాడని రాజా సింగ్ ఆరోపించారు.
పవిత్ర రంజాన్ మాసంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విషం కక్కుతున్నారని రాజా సింగ్ ఆరోపించారు. భయపడేవాళ్లు పాకిస్తాన్ పారిపోయారు.. తాము కొట్లాడే వాళ్లం కాబట్టి ఇక్కడే ఉన్నాం అంటున్నాడు ఓవైసీ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ పారిపోయేది అసదుద్దీనే అని అన్నారు. అసదుద్దీన్ దేశం విడిచి పారిపోవడం ఖాయమని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.