మంత్రి కేటీఆర్ కు సినిమాను సజెస్ట్ చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్

BJP MLA Raja Singh Fires On KTR. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  27 July 2022 3:45 PM GMT
మంత్రి కేటీఆర్ కు సినిమాను సజెస్ట్ చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలిని వైద్యులు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ విశ్రాంతి సమయంలో ఓటీటీ కి సంబంధించి ఎవరైనా తనకు ఓటీటీ షోలకు సంబంధించి సలహా ఇవ్వాలని కేటీఆర్ ట్విట్టర్ లో కోరారు.

కేసీఆర్ పై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ, 'కాలు విరిగిందని ఇంట్లో కూర్చున్నావు కదా. మంచి సినిమా ఉంటే చెప్పండని అడిగావు కదా. నేను ఒక సినిమా చెపుతా చూస్కో. 'కాశ్మీర్ ఫైల్స్' సినిమా చూడు. లేకపోతే ప్రధాని మోదీ స్పీచ్ కానీ, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి హిస్టరీ కానీ చూడు. మంచి మనిషివి అవుతావ్. నాస్తికుడివైన నీవు ఆస్తికుడివి అవుతావు. నీకు ఇది నా అడ్వైజ్' అని చెప్పారు. ఇక జీఎస్టీపై మాట్లాడేందుకు, పెరుగుతున్న ధరలపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తే తమ ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేశారని కేటీఆర్ ట్వీట్ చేశారని... ఈ రకంగా ట్వీట్ చేసే అర్హత కేటీఆర్ కు లేదని ఆయన అన్నారు. 'గతం మర్చిపోయావా... మా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెషన్ మొత్తం మీరంతా కలిసి సస్పెండ్ చేయలేదా? ఈరోజు మీరు సస్పెన్షన్ గురించి మాట్లాడతారా? మీరందరూ కలిసి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.Next Story
Share it