రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు ఇవ్వడంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే

BJP MLA Raghunandan Rao. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు

By Medi Samrat  Published on  16 Dec 2022 1:00 PM GMT
రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు ఇవ్వడంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే

డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్‌కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉందని.. ఛార్జీషీట్ ఫైల్ చేయకుండానే బెంగళూరు డ్రగ్స్ కేసు ఎలా క్లోజ్ అవుతుందని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరు బీఆర్ఎస్ నేతలకు ఈడీ నోటీసులు రావచ్చని రఘునందన్ రావు చెప్పారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రూ. 100 కోట్లు ఎక్కడ ఉన్నాయో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

రకుల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు పంపింది. డిసెంబర్‌ 19వ తేదీన విచారణకు హాజరుకావాలని రకుల్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఇక కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు పంపింది. ఈ కేసులో గత సంవత్సరం సెప్టెంబర్‌ 3న రకుల్‌ను ఈడీ విచారించింది. అయితే అప్పుడు అర్జెంట్‌గా ఏదో పని ఉందని చెప్పి విచారణలో మధ్యలోనే వెళ్లిపోయింది రకుల్‌. అప్పుడు పూర్తి స్థాయిలో రకుల్‌ను అధికారులు విచారించలేకపోయారని.. ఈ క్రమంలోనే రకుల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ వ్యవహారంపై 2017 జులైలో ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద తెలంగాణ ఎక్సైజ్‌ పోలీసులు కేసు ఫైల్‌ చేశారు. ఆ తర్వాత సిట్‌ను ఏర్పాటు చేసి పలువురు సినీ సెలబ్రిటీలను విచారించారు.


Next Story