సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కింది : ఆర్మూర్ ఎమ్మెల్యే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కిందని ఆర్మూర్ లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు

By Medi Samrat  Published on  25 Dec 2023 8:46 PM IST
సీఎం రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కింది : ఆర్మూర్ ఎమ్మెల్యే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అహంకారం తలకెక్కిందని ఆర్మూర్ లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కొడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆర్మూర్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. నేను ఇద్దరం సమానమే, ఇద్దరికీ సమాన హక్కులు ఉండాలని అన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసినట్లు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని.. ఓడిపోయిన వారు అధికారులతో రివ్యూ చేయాలని సీఎం ఎలా చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఆత్మ గౌరవం తగ్గిస్తే మీ ఆత్మ గౌరవం కూడా తగ్గిస్తామంటూ హెచ్చరించారు. ఆర్మూర్ లో ఓడిన అభ్యర్థి వినయ్ రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నట్లు నా దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రజ స్వామ్యంగా వినయ్ రెడ్డి రాజకీయం చేయాలి లేకుంటే ఆర్మూర్ నుంచి బహిష్కరిస్తామని ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. చట్టం తన పని చేయక పోతే రాకేష్ రెడ్డి చట్టం మొదలవుతుందని హెచ్చరించారు.

కొద్దిరోజుల కిందట కూడా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని.. విదేశాల నుంచి కూడా చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రెండు వారాల కిందట ఆరోపించారు.

Next Story