తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ నేతల విమర్శలు

BJP Leaders Slams On Budget. తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు

By Medi Samrat  Published on  6 Feb 2023 11:00 AM GMT
తెలంగాణ బడ్జెట్ పై బీజేపీ నేతల విమర్శలు

తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ బడ్జెట్ అంతా అంకెల గారడీ అని.. ఈ బడ్జెట్ గందరగోళంగా ఉందని, ప్రజాస్పందన కరవైన బడ్జెట్ అని అన్నారు. ముఖ్యమంత్రిగారి మాటల్లో చెప్పాలంటే సరుకు లేదు, సంగతి లేదు. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. శుష్కప్రియాలు, శూన్యహస్తాలు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అంతా వట్టిదే, డబ్బా బడ్జెట్ బభ్రాజమానం భజగోవిందం అని అన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పందిస్తూ.. బడ్జెట్‌లో చెప్పేదానికి వాస్తవానికి పొంతన లేదని అన్నారు. విద్యా, వైద్య రంగానికి సరైన కేటాయింపులు లేవని అన్నారు. విద్యావాలంటీర్లకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉందని అన్నారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించలేమని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయని.. ఆరోగ్యశ్రీ డబ్బులను ఆసుపత్రులకు ప్రభుత్వం ఇవ్వడంలేదన్నారు. తెలంగాణలో ఎక్సైజ్‌ శాఖ ఆదాయం 10వేల కోట్ల నుంచి 45వేల కోట్లకు పెరిగిందని అన్నారు.


Next Story