సీఎం, డిప్యూటీ సీఎంకు విబేధాలు ఉన్నాయి.. ఏలేటి సంచలన వ్యాఖ్యలు
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik
సీఎం, డిప్యూటీ సీఎంకు విబేధాలు ఉన్నాయి..బీజేపీఎల్పీ నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు
మీడియాతో చిట్ చాట్ సందర్భంగా బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సీఎంను మార్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది ఉని హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి విభేదాలు ఉన్నాయి. మంత్రి వర్గ విస్తరణ ఆపుతుంది రేవంత్ రెడ్డి..అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మంత్రులు ఎవరూ సమర్థించడం లేదు. మంత్రులు రెండు వర్గాలుగా చీలిపోయారు. కాంగ్రస్ పార్టీని రేవంత్ భ్రష్టు పట్టిస్తున్నారు అని పార్టీలో చర్చ జరుగుతుంది. సీఎం ఇంట్లో రివ్యూ పెట్టడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు ఇబ్బంది పడుతున్నారు. సీఎం పని తీరుపై భట్టి, ఉత్తమ్ ఎప్పటికప్పుడు నివేదిక పంపుతున్నారు...అని ఏలేటి వ్యాఖ్యానించారు.
భూముల అన్యాక్రాంతంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్‌కు గ్యాప్ పెరిగింది. ఇప్పటికే మంత్రుల్లో వ్యతిరేకంగా ఉన్న వాళ్లు ఎక్కువగా ఉన్నారు. అందుకే మంత్రి వర్గ విస్తరణ ఆపుతున్నాడు. వివిధ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వర్గ ఆశావాహులు మధ్య వ్యూహాత్మకంగా చిచ్చు పెడుతున్నారు. తన వర్గానికి చెందినవారు మంత్రి పదవులు రావు అని, తన దగ్గర ఉన్న శాఖలు వేరే వారికి పోతాయి అని ఆయనే ఆపుతూ జగన్నాటకం ప్రదర్శిస్తున్నారు. బీసీలకు 42% చోటు ఇవ్వాలి అంటే నలుగురు, ఐదుగురికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని ఆపుతున్నాడు. రాష్ట్రం ఈరోజు దివాలా తీసింది అని రాష్ట్రంలో వచ్చే ఖర్చు రాబడి గురించి అనేక సార్లు సీఎం మాట్లాడాడు కానీ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మాట్లాడలేదు. సీఎంకి డిప్యూటీ సీఎంకి విభేదాలు ఉన్నాయి. ఎక్కడ కూడా మాట్లాడలేదు ఆయనే కాదు మంత్రులు ఎవరు మాట్లాడటం లేదు. ఉద్యోగులను విలన్‌గా చూపెట్టి ప్రయత్నం చేశారు ఈ విషయంపై మంత్రులు ఎవరు మాట్లాడలేదు..అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి మంత్రులు ఎవరూ సమర్థించడం లేదు. ఫైనాన్స్ ఎమర్జెన్సీ విధించే దిశగా సీఎం ఉన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసిన రామకృష్ణ ను చీఫ్ సెక్రటరీగా నియామకం అందుకు నిదర్శనం. మంత్రులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పని తీరుపై నివేదిక రాహుల్ గాంధీకి ఇస్తున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చినప్పుడు రాహుల్ గాంధీ సీఎంతో మాట్లాడలేదు. . కొన్ని మంత్రిత్వ శాఖల్లో ముఖ్యమంత్రి జోక్యంతో సమన్వయం కోల్పోతున్నారు..అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.