బీజేపీ హైక‌మాండ్‌కు షాక్‌.. పోటీకి దూరంగా డీకే అరుణ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో

By Medi Samrat  Published on  1 Nov 2023 1:35 PM GMT
బీజేపీ హైక‌మాండ్‌కు షాక్‌.. పోటీకి దూరంగా డీకే అరుణ

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బుధవారం ప్రకటించారు.

తన నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్‌కు తెలియజేసి.. తన స్థానంలో వెనుకబడిన వర్గానికి చెందిన నేతకు గద్వాల్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కోరినట్లు అరుణ ఢిల్లీలో మీడియాకు తెలిపారు.

బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలనే పార్టీ విధానంలో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి తెలిపారు.

సీనియ‌ర్ ఫొలిటీషియ‌న్‌గా, ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో బ‌ల‌మైన నాయ‌కురాలిగా పేరున్న‌ డీకే అరుణ అనూహ్య‌ నిర్ణ‌యం ప‌ట్ల ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెల‌వాల‌న్న బీజేపీ రాష్ట్ర అధినాయ‌క‌త్వానికి ఓ ర‌కంగా గ‌ట్టి షాకే త‌గిలింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

డీకే అరుణ 2018లో గద్వాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.

Next Story