చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని నియమించే పార్టీ బీజేపీ కాదు: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ప్రకటించినట్లు జరుగుతోన్న ప్రచారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.

By Knakam Karthik
Published on : 30 Jun 2025 3:00 PM IST

Telangana, Bjp, Telangana Bjp President, Bandi Sanjay

చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని నియమించే పార్టీ బీజేపీ కాదు: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి పేరు ప్రకటించినట్లు జరుగుతోన్న ప్రచారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధిష్టానం ఇంకా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించలేదు. ఎవరికి వాళ్లు చంద్రబాబు చెప్తే అధ్యక్షుడిని ప్రకటించారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అందరూ నామినేషన్ వేశాక ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. చంద్రబాబు, లేదా ఇంకో వేరే వ్యక్తి ఎవరో చెబితే అధ్యక్షుడిని నియమించే పార్టీ బీజేపీ కాదు..అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Next Story